1-844-626-BADI(2234)
info@v1.manabadi.siliconandhra.org

FLC for ManaBadi in Poway Unified School District

కాలిఫోర్నియా: తెలుగు భాషను ప్రాచీన భాష నుండి, ప్రపంచ భాషగా ముందుతరాలకు అందించే సంకల్పంతో, 6500 మందికి పైగా విద్యార్ధులకు తెలుగు నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి ఆ దిశగా మరో విజయం సాధించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని, సాండియాగో నగరం లో ‘పోవే’ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో, మనబడి పాఠ్య ప్రణాళికా ప్రమాణాలకు వరల్డ్ లాంగ్వేజ్ గుర్తింపు సాధించింది. దీని ద్వారా మనబడి లో తెలుగు నేర్చుకునే విద్యార్ధులకు  ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ సాధించడానికి అర్హత లభిస్తుంది. అంటే పోవే యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో 9,10,11,12  తరగతులు చదివే హై స్కూల్ విద్యార్ధులు ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ అర్హత సాధించడానికి స్పానిష్, జెర్మన్ లాంటి భాషలు లాగా మనబడి లో తెలుగు నేర్చుకోవడం ద్వారా కూడా  Foreign Language Credit  కి అర్హత సాధించవచ్చు. ఇప్పటికే అమెరికాలోని వివిధ స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో  మనబడి పాఠ్య ప్రణాళిక ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ కు అర్హత సాధించడమే కాకుండా, ప్రతిష్టాత్మకమైన  WASC(Western Association of Schools and Colleges)  వారి ఎక్రిడిటేషన్ కూడా సాధించిన విషయం తెలిసిందేనని, మనబడి కొత్త విద్యా సంవత్సం 2016-17 తరగతులు సెప్టెంబర్ 10 నుండి ప్రారంభం కానున్నాయని – తమ పిల్లలకు తెలుగుభాష  నేర్పించాలనుకునే వారందరూ వెంటనే v1.manabadi.siliconandhra.org ద్వారా సిలికానాంధ్ర మనబడి లో అడ్మిషన్ పొందవచ్చని మనబడి డీన్ రాజు చమర్తి తెలిపారు.

మనబడి ఎక్రిడిటేషన్ విభాగం ఉపాధ్యక్షులు శ్రీదేవి గంటి  నాయకత్వం లో, పోవే స్కూల్ డిస్ట్రిక్ట్ (Poway Unified School District) లో వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్  అర్హత సాధన ప్రక్రియ లో  సాన్ డియాగో మనబడి సమన్వయకర్తలు జవహర్ కంభంపాటి, హేమచంద్ర తలగడదీవి, బేబి లింగంపల్లి,  ప్రవీణ్ శనిగేపల్లి, మహేష్ కోయ గారు ఎంతో కృషి చేసారని, మనబడి ఆర్ధిక విభాగం ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల  అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా మనబడి గ్లోబల్ డెవెలప్‌మెంట్ ఉపాద్యక్షులు శరత్ వేట మాట్లాడుతూ, తెలుగుభాషా దినోత్సం సందర్భంగా  సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో అమెరికా వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో  జరిగిన తెలుగుకు పరుగు కార్యక్రమంలో పాల్గొని తెలుగు భాష పట్ల తమ అభిమానాన్ని చాటిన మనబడి భాషా సైనికులందరికీ, సహకరించిన వివిధ తెలుగు సంస్థలన్నిటికీ ధన్యవాదాలు తెలిపారు.
Menu Title